Header Banner

కేంద్రం వాహనదారులకు శుభవార్త! జాతీయ రహదారులపై టోల్ కొత్త పథకం!

  Mon May 26, 2025 08:59        Politics

జాతీయ రహదారులపై తరచూ ప్రయాణాలు చేస్తూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్‌లతో ఇబ్బందులు పడే వాహనదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఖర్చు తగ్గించేందుకు ఫాస్ట్ ట్యాగ్ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. తాజా ప్రతిపాదనలో భాగంగా, వాహనదారులు త్వరలో రూ.3 వేల వార్షిక రుసుము చెల్లించే అవకాశం రావచ్చు.
తద్వారా వారు ఏడాది పొడవునా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేలపై స్వేచ్ఛగా, పరిమితులు లేకుండా ప్రయాణించవచ్చు. కొత్తగా తీసుకురానున్న ఈ పథకంలో రెండు చెల్లింపు విధానాలను తీసుకురాబోతున్నారు. ఇందులో మొదటిది వార్షిక పాస్. దీనికి ప్రతి సంవత్సరం రూ.3 వేల ఫ్లాట్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది వినియోగదారులకు టోల్ రోడ్లపై అపరిమిత ప్రయాణాన్ని అందిస్తుంది. రెండవది దూరాన్ని బట్టి పాస్ తీసుకునే సౌకర్యం. ఈ పథకం కింద వాహనదారులు వంద కిలోమీటర్లకు రూ.50లు నిర్ణీత నగదు చెల్లిస్తారు. దీనికి అదనపు ధ్రువపత్రాలు కూడా ఏమీ అవసరం లేదు.


ఇది కూడా చదవండి: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


సినిమా పరిశ్రమలో అనవసర వివాదాలు సహించం.. పవన్‌ కల్యాణ్‌ డీప్‌గా హర్ట్‌ - ఏపీ మంత్రి హెచ్చరిక!


శ్రీవారి సేవల్లో భారీ మార్పులు! ఎన్నారైలకు ప్రత్యేక ప్రణాళికలు!


ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం భేటీ! పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై..


ఈ ఆధార్ 5 సంవత్సరాల తర్వాత పని చేయదు..! ఎందుకో తెలుసా?


దేశ రహస్యాలు పాక్‌కు! గుజరాత్‌లో ఆరోగ్య కార్యకర్త అరెస్ట్!


ఎల్‌ఐసీ సంచలనం! 24 గంటల్లో లక్షల పాలసీలు, గిన్నిస్ రికార్డు!


ఏపీలో కొత్తగా రెండు యూనివర్సిటీలు..! ఎక్కడెక్కడంటే ?


జర్మనీలో వైభవంగా టీడీపీ మహానాడు! పుల్వామా వీరులకు నివాళి, ప్రవాసులకు హామీ!


మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!


బిగ్ అలర్ట్.. యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు.. జూన్ 30 నుంచి..


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #vehicles #travell #goodnews #tollgate #charges #newprocess